ఎట్టకేలకు రిలీజ్ కానున్న ‘పద్మావతి’

Tuesday,January 09,2018 - 10:02 by Z_CLU

సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కిన పద్మావతి రిలీజ్ డేట్ ఫిక్సయింది. గత కొన్ని రోజులుగా చరిత్రను వక్రీకరించారనే ఆరోపణల మధ్య నలుగుతున్న ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలతో పాటు టైటిల్ ని మార్చమని సూచించడంతో ‘padmavati’కి బదులుగా ‘Padmavat’ గా జనవరి 25 న రిలీజ్ కానుందీ సినిమా.

దీపికా పడుకొనే తో పాటు, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, అదితి రావు హైదరి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తో పాటు, భన్సాలి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంచిత్ బల్హారా మ్యూజిక్ కంపోజ్ చేశాడు.