దర్శకుడు రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,July 10,2017 - 11:45 by Z_CLU

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 4న దర్శకుడు థియేటర్లలోకి వస్తున్నాడు.

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ నిర్మించిన ఈ సినిమాలో అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేయగా, ఓ పాటను రకుల్ ప్రీత్ విడుదల చేసింది. లెజెండ్ డైరక్టర్లపై తయారుచేసిన ఓ వీడియోను దర్శకుడు సురేందర్ రెడ్డి రిలీజ్ చేశారు.

త్వరలోనే మిగతా పాటలను కూడా ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సుకుమార్ అంటున్నాడు. ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు.