హ్యాప్పీ బర్త్ డే – కోట శ్రీనివాసరావు స్పెషల్

Monday,July 10,2017 - 12:30 by Z_CLU

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ స్పెషల్ పేజీని క్రియేట్ చేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు ఈ రోజు తన 73 పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 1978 లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెరంగేట్రం చేసిన కోట శ్రీనివాసరావు ఒక్క తెలుగులోనే 234 సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు 9 నంది అవార్డులను సొంతం చేసుకున్న కోటను.. 2015లో పద్మశ్రీ కూడా వరించింది.

కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు కోట. సినిమా సినిమాకి డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేయాలన్నది సక్సెస్ మంత్రం అయితే, నటించే ప్రతి క్యారెక్టర్ లో లీనమైపోయి దానికి 100% న్యాయం చేయాలన్నదే కోట ఫిలాసఫీ.

బేసిగ్గా కోట గారి తండ్రి డాక్టర్ అవ్వడం చేత, ఈయనపై కూడా పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనే ప్రెజర్ బాగానే ఉండేదట. కానీ యాక్టర్ అవ్వాలనే కసి ఆ అడ్డంకులను అవలీలగా దాటేసి సక్సెస్ యాక్టర్ గా నిలబెట్టింది.

తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన కోట శ్రీనివాసరావు 8 బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. యాక్టర్ గా ఓ రేంజ్ హైట్స్ ని చూసిన అయన గబ్బర్ సింగ్ సినిమాలో ‘మందు బాబులం’ అనే పాట కూడా పాడారు. డెబ్బైల్లోనూ అంతే ఎనర్జిటిక్ గా అంతే ఉత్సాహంగా నటిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న కోట శ్రీనివాస రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తుంది జీ సినిమాలు.