మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రెడీ అయిన గోపీచంద్

Monday,July 10,2017 - 11:08 by Z_CLU

ఆరడుగుల బుల్లెట్ అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఇప్పుడు గోపీచంద్ నుంచి మరో సినిమా విడుదలకు ముస్తాబైంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకొన్నాయి. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “ఆక్సిజన్”. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో సినిమాను తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా “ఆక్సిజన్” కు సంగీత దర్శకుడు. త్వరలోనే పాటల్ని విడుదల చేయబోతున్నారు.

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.