రేపే "దర్శకుడు" టీజర్ లాంచ్

Saturday,May 20,2017 - 11:10 by Z_CLU

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన సినిమా దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల కాగా.. రేపు టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నాడు. గతంలో కుమారి 21-ఎఫ్ టీజర్ ను కూడా ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. అది పెద్ద హిట్ అయింది. ఆ సెంటిమెంట్ కొద్దీ దర్శకుడు సినిమాకు కూడా టీజర్ ను రిలీజ్ చేయాల్సిందిగా ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేశాడు సుకుమార్.

హరిప్రసాద్ జక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్శకుడు సినిమాతో అశోక్ హీరోగా పరియమౌతున్నాడు. ఈషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మూవీని వచ్చేనెల 9న విడుదల చేయాలని అనుకుంటున్నారు.