Tollywood Corona - షూటింగ్స్ మళ్ళీ వాయిదా

Saturday,January 08,2022 - 12:41 by Z_CLU

Corona Third Wave effect on Tollywood.. Shootings cancel

ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తాజాగా టాలీవుడ్ కి కూడా తాకింది. సూపర్ స్టార్ మహేష్ తో పాటు తమన్ కి కూడా కరోనా వచ్చింది. ఈ వారంలో కొంతమంది సెలెబ్రిటీస్ కోవిడ్ తో ఎఫెక్ట్ అయ్యారు. మంచు లక్ష్మి, మంచు మనోజ్, త్రిష, సత్యరాజ్, విశ్వక్ సేన్, వరలక్ష్మి శరత్ కుమార్.. ఇలా చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ థర్డ్ వేవ్ ప్రభావం షూటింగ్స్ పై కూడా పడింది.

ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా కొన్ని నెలలు బడా సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అవ్వనుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. దీంతో జనవరి నెలాఖరు నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకూ ఓ నెల పాటు షూటింగ్స్ అన్నీ పోస్ట్ పోన్ అవుతాయని ఇన్సైడ్ టాక్.

బడా హీరోలు కూడా దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతూ కొన్ని రోజులు షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని మాట్లాడుతున్నారట. ఇక ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ముందుగానే జాగ్రత్త పడితే కోవిడ్ ఎఫెక్ట్ నుండి తప్పించుకోవచ్చని యాక్టర్స్ ఆలోచిస్తున్నారు. కానీ సినిమా షెడ్యుల్ కోసం కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలకు మాత్రం ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది.