Sankranthi Movies 2022 - ఈ సినిమాలు ఫిక్స్

Saturday,January 08,2022 - 12:53 by Z_CLU

List of Sankranthi Movies in 2022

ప్రతీ ఏడాది సంక్రాంతి పండక్కి టాలీవుడ్ లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా ‘RRR’,’రాధే శ్యామ్’ సినిమాలు పోటీ పడ్డాయి. కానీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాన్ ఇండియాలు వాయిదా పడ్డాయి. అయితే ఈసారి సంక్రాంతి రానున్న పెద్ద సినిమా అంటే ‘బంగార్రాజు’ ఒక్కటే. మిగతా సినిమాలన్నీ కొత్త హీరోలవే.

జనవరి 14న సంక్రాంతి కానుకగా నాగార్జున -నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ మొదలు పెట్టేసి సాంగ్స్ , టీజర్ ఇలా ఒక్కొక్కటి వదులుతూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘రౌడీ బాయ్స్’. ఈ సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమవుతున్నాడు ఆశిష్. ఈ సినిమాతో ఆశిష్ ని హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రిలీజైన కంటెంట్ కూడా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఇదే డేట్ కి సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన’డీజే టిల్లు’ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది.

ఇక సంక్రాంతి నాడు అంటే జనవరి 15న మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న ‘హీరో’ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ప్రస్తుతానికి ఈ లిస్టు కన్ఫర్మ్ అయింది. రాజశేఖర్ ‘శేఖర్’, ఎమ్మెస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’ , కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ అంటూ ప్రకటించారు. పొంగల్ కి ఇంకా వారం రోజులే ఉంది కానీ ఇంకా వాటి డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ సినిమాలు సంక్రాంతికి రాకపోవచ్చనే టాక్ వినబడుతుంది.