Kiran Abbavaram Geetha Arts 2 - వినరో భాగ్యము విష్ణుకథ

Friday,January 07,2022 - 02:05 by Z_CLU

Kiran Abbavaram New Movie Launch Titled as Vinaro Bhagyamu Vishnu Katha

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా మరో సినిమా లాంచ్ అయింది. యంగ్ హ్యాపెనింగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇందులో హీరో. ఈ సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ పెట్టారు. యంగ్ హీరోయిన్ క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్.

ఈరోజు ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. అల్లు అర‌వింద్ ముఖ్య అతిధిగా హాజ‌రై పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, హీరోయిన్ క‌శ్మీరా ప‌ర్ధేశీల పై అల్లు అన్విత క్లాప్ కొట్టి ప్రారంభించారు. నిర్మాత బ‌న్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు.  

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha

ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురిళి కిషోర్ గ‌తంలో పనిచేశారు. ఓ వినూత్న‌మైన క‌థ‌తో ఈ నూత‌న చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు.

ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 
Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha
స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీవాసు
స‌హనిర్మాత – బాబు
ద‌ర్శ‌క‌త్వం – ముర‌ళి కిషోర్ అబ్బురూ
ఎడిట‌ర్ – మార్తండా కే వెంక‌టేశ్
మ్యూజిక్ – చైత‌న్ భ‌ర‌ద్వాజ్
‌సినిమాటోగ్ర‌ఫి – విశ్వాస్ డేనియ‌ల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ – స‌త్య గమిడి, శ‌ర‌త్ చంద్ర నాయుడు
ఆర్ డైరెక్ట‌ర్ – రామ్ కుమార్
ప్రొడక్ష‌న్ రిప్రెజంటేటివ్ – ప్ర‌సాద్ చ‌వ‌న్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్