కొరటాలకు చిరు "స్వీట్" వార్నింగ్

Monday,January 06,2020 - 12:58 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, తన డైరక్టర్ కొరటాల శివకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న మూవీని వంద రోజుల్లోపే పూర్తిచేయాలని కండిషన్ పెట్టారు. సభాముఖంగా కొరటాల శివ నుంచి మాట తీసుకున్నారు చిరంజీవి. చిరు-కొరటాల మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో.. చిరంజీవి చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే మార్చి 30లోపు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి.

ప్రతి హీరో, ప్రతి డైరక్టర్ సినిమాల్ని వేగంగా తీయాలి. అందరూ ఫాస్ట్ గానే తీయాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. థియేటర్లు కళకళలాడుతాయి. బయ్యర్లు హాయిగా ఉంటారు. నాతో సినిమా తీస్తున్న కొరటాల శివకు ఇదే చెప్పాను. సాధారణంగా సినిమాకు 140 రోజులు తీసుకుంటారు కొరటాల. ఈసారి అలా చేయరనే అనుకుంటున్నాను.

నేను 7 గంటలంటే 7కే వచ్చేస్తాను. కాబట్టి నాతో ఎక్కువ రోజులు టైమ్ తీసుకోనని శివ చెప్పారు. 80 నుంచి 99 రోజుల్లోనే సినిమా పూర్తిచేస్తానన్నారు. వంద అనే మాట వినిపించదు. పబ్లిక్ లో కమిట్ అవుతున్నాను శివ.. 99 రోజులు మించి తీస్తే మర్యాదగా ఉండదు.