#Chiru152 - అఫీషియల్ స్టేట్ మెంట్

Tuesday,August 18,2020 - 05:46 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది. మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను Chiranjeevi పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై Ramcharan, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. Acharya సినిమాకు సంబంధించి ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయింది. Kajal ఇందులో మెగాస్టార్ సరసన మరోసారి నటిస్తోంది.

ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్ గా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నారు.