వైరల్ అవుతున్న మెగాస్టార్ లుక్

Monday,February 24,2020 - 01:31 by Z_CLU

కొరటాల-చిరంజీవి సినిమా సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇప్పుడీ సినిమా నుంచి చిరంజీవి లుక్ లీక్ అయింది. షూటింగ్ స్పాట్ లో నక్సలైట్ గెటప్ లో ఉన్న చిరంజీవి స్టిల్ ను ఎవరో సీక్రెట్ గా క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టేశారు.

ఆచార్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం ఈ లుక్ చూస్తేనే అర్థమౌతుంది. మూవీకి సంబంధించి ఇప్పటికే కోకాపేట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. రెజీనా-చిరంజీవి మధ్య ఐటెంసాంగ్ కూడా పూర్తిచేశారు. ఇప్పుడు ఫిలింసిటీలో మరో షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ లొకేషన్ నుంచే మెగాస్టార్ లుక్ లీక్ అయినట్టు టాక్.

కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ల పై చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 14 లేదా అక్టోబర్ 2న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.