బన్నీ డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వనుందా ?

Monday,January 06,2020 - 01:36 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ కి సంబంధించి ఈ రోజు మ్యూజిక్ కన్సర్ట్ పేరుతో ఓ ఈవెంట్ జరగనుంది. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ సెలెబ్రేషన్స్ లో బన్నీ డ్యాన్స్ వేయబోతున్నాడట. ‘రాములో రాములా’ సాంగ్ కి బన్నీ సిగ్నేచర్ స్టెప్స్ వేస్తాడని సమాచారం.

ఇక ఈవెంట్ లో తమన్-శివమణి మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ తో పాటు సింగర్స్ సాంగ్స్ పాడటం ఇలా కంప్లీట్ గా దీన్ని ఓ మ్యూజికల్ ఈవెంట్ లా ప్లాన్ చేశారట. ఇక సాయంత్రం జరగనున్న ఈ ఈవెంట్ లో బన్నీ స్టెప్స్ వేస్తే మాత్రం ఈవెంట్ కి అదే  స్పెషల్ ఎట్రాక్షన్ గా అవ్వడం ఖాయం.