జులై 30న వరుణ్ తేజ్ మూవీ రిలీజ్

Monday,February 24,2020 - 03:01 by Z_CLU

ఈ మధ్యే లాంఛ్ అయింది వరుణ్ తేజ్ సినిమా. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అంతలోనే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసింది యూనిట్. ఈరోజు వైజాగ్ లో ఈ షూటింగ్ ప్రారంభమైంది. సినిమాను జులై 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో హెవీ వెయిట్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. దీని కోసం బరువు పెరగడమే కాకుండా ప్రత్యేకంగా బాక్సింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ (బాబి), సిద్ధూ ఈ ప్రాజెక్టుకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది.