నితిన్ హీరోగా అంథాదున్ రీమేక్ ప్రారంభం

Monday,February 24,2020 - 01:18 by Z_CLU

భీష్మ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు నితిన్. అదే ఊపులో ఈరోజు మరో సినిమా లాంఛ్ చేశాడు. అది కూడా తన సొంత బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ చేశాడు.

నితిన్ హీరోగా ఈరోజు అంథాదున్ రీమేక్ ప్రారంభమైంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి (నితిన్ తండ్రి), నికితా రెడ్డి (నితిన్ అక్క) నిర్మాతలుగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు సురేందర్ రెడ్డి ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతోంది అంథాదున్ రీమేక్. ఇంతకుముందు కృష్ణార్జున యుద్ధం, ఎక్స్ ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలు తీశాడు ఈ దర్శకుడు. ఈసారి అంథాధున్ అనే రీమేక్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూట్ ఉంటుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్టయింది అంథాదున్. శ్రీరామ్ రాఘవన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరో. టబు కీలకమైనా పాత్ర పోషించింది. ఇందులో హీరోకు కళ్లు కనిపించవు. ఆయుష్మాన్ పాత్రను నితిన్ పోషిస్తున్నాడు. టబు పాత్రను ఎవరు పోషిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.