చిరు 151.. గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న చరణ్

Saturday,August 19,2017 - 03:06 by Z_CLU

స్వాతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథతో మెగా స్టార్  151 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమాను ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఇటీవలే చాలా సింపుల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేశాడు చిరు … అయితే సినిమాను సింపుల్ గా స్టార్ట్ చేసిన యూనిట్ ఆగస్టు 22 న చిరు పుట్టినరోజు సందర్భంగా ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట..

ఇప్పటికే ఈ ఈవెంట్ ప్లానింగ్ తో బిజీ అయ్యాడట చెర్రీ. తన నిర్మాణంలో రెండో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ ను ఈ ఈవెంట్ తోనే గ్రాండ్ గా ప్రారంభించి సినిమాపై ఓ రేంజ్ హైప్ తీసుకురావాలని భావిస్తున్నాడట.. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 తో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్ పై చరణ్ ప్రత్యేక దృష్టి పెట్టాడని అందుకే చిరు పుట్టినరోజు నుంచే ఈ భారీ ప్రమోషన్ మొదలు పెట్టబోతున్నాడని టాక్.

ఆగస్టు 22 న గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ లో రాజమౌళి  ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేయనున్నాడని, జక్కన్నతో పాటు మరి కొందరు అగ్ర దర్శకులు, సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారని సమాచారం.