శరవేగంగా సాగుతున్న బాలయ్య 102వ సినిమా

Saturday,August 19,2017 - 11:02 by Z_CLU

పైసా వసూల్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన బాలకృష్ణ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన 102వ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. పైసా వసూల్ సినిమాకు గుమ్మడికాయ కొట్టిన మరుసటి రోజే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించిన బాలకృష్ణ.. ఇప్పుడా సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్ గా ప్రారంభమైన బాలయ్య 102వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

కేఎస్ రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. సి.కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు. మరో హీరోయిన్ కు కూడా చోటుంది. ఇక బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి సంగీతం అందించిన చిరంతన్ భట్, ఈ కొత్త సినిమాకు కూడా బాణీలు అందిస్తున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తన 102వ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య