'ఛల్ మోహన్ రంగ' ఫస్ట్ సింగిల్ రిలీజ్

Saturday,February 24,2018 - 11:49 by Z_CLU

నితిన్ అప్ కమింగ్ మూవీ ఛల్ మోహన్ రంగ. ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. గ..ఘ..మేఘ అనే లిరిక్స్ తో సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.


తాజా సింగిల్ ను రాహుల్ నంబియార్ ఆలపించగా.. కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చాడు. కృష్ణ చైతన్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. దానికి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

నితిన్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కథ అందించడం విశేషం. అంతేకాదు… ఈ సినిమాకు ఇతడు నిర్మాత కూడా. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై త్రివిక్రమ్, పవన్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మించారు.