వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్-ఉన్నది ఒకటే జిందగీ

Saturday,February 24,2018 - 11:09 by Z_CLU

  • జీ తెలుగు సగర్వంగా సమర్పిస్తోంది.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఉన్నది ఒకటే జిందగీ

  • ఈనెల 25న ప్రసారమయ్యే ఈ సినిమాతో మీ స్నేహితులతో ఆనందంగా గడపండి

  • అంతే కాదు.. జీ తెలుగు హ్యాంగ్ అవుట్ పార్టీలో ఎంజాయ్ చేసే ఛాన్స్ కూడా

తెలుగు రాష్ట్రాల్లో లీడింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.. ప్రేక్షకులకు సగర్వంగా సమర్పిస్తోంది.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నది ఒకటే జిందగీ. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కాబోతోంది ఉన్నది ఒకటే జిందగీ. సో.. ఈ వీకెండ్ ను మీ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా మీ స్నేహితులతో ఆనందంగా గడపడానికి ఓ అద్భుతమైన వేదికను మీకు అందిస్తోంది జీ తెలుగు.

అందమైన ప్రేమ. అంతకంటే అందమైన స్నేహం. ఈ రెండింటినీ పెర్ ఫెక్ట్ గా మిక్స్ చేస్తూ తెరకెక్కిన చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. ప్రేమ కంటే ఫ్రెండ్ షిప్ కే ఎక్కువ విలువనిచ్చే హీరో. అలాంటి హీరో కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమయ్యే ఫ్రెండ్. ఇలాంటి రెండు ఎమోషనల్ క్యారెక్టర్స్ తో అత్యద్భుతంగా తెరకెక్కింది ఉన్నది ఒకటే జిందగీ సినిమా. అభిగా ఎనర్జిటిక్ స్టార్ రామ్, వాసు పాత్రలో శ్రీవిష్ణు క్యారెక్టర్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. వీళ్లతో పాటు నటించిన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి సినిమాకు మరింత ఎట్రాక్షన్ తీసుకొచ్చారు.

ఓ వైపు హీరోల మధ్య ఫ్రెండ్ షిప్ ను హార్ట్ టచింగ్ గా చూపిస్తూనే, మరోవైపు లవ్ ట్రాక్ ను అద్భుతంగా నడిపి శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. కేవలం డైరక్టర్ గానే కాకుండా.. డైలాగ్ రైటర్ గా కూడా ది బెస్ట్ అనిపించుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి చూపించిన అందమైన విజువల్స్, వాటికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మెలొడీ మ్యూజిక్.. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ చేశాయి.

ఉన్నది ఒకటే జిందగీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన కాంటెస్ట్ లాంచ్ చేసింది జీ తెలుగు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలను జీ తెలుగు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయడమే. లక్కీ విన్నర్స్, జీ తెలుగు ఇచ్చే హ్యాంగ్-అవుట్ పార్టీలో పాల్గొనే అవకాశాన్ని గెలుచుకుంటారు. మరిన్ని వివరాలకు జీ తెలుగు, జీ తెలుగు హెడ్ డీ ఛానెల్స్ చూస్తూనే ఉండండి.

ఉన్నది ఒకటే జిందగీ.. ఈ ఆదివారం (ఫిబ్రవరి 25) సాయంత్రం 6 గంటలకు.. మీ జీ తెలుగులో…