ఛల్ మోహన్ రంగ సెన్సార్ టాక్

Monday,April 02,2018 - 03:54 by Z_CLU

నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సినిమాకు ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ అయ్యాయి. మూవీ చూసిన సెన్సార్ ఆఫీసర్స్ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనింగ్ గా ఉందని మెచ్చుకున్నారు.

99 శాతం తెలుగు సినిమాలు U/A సర్టిఫికేట్ తో వస్తాయి. క్లీన్-యు సర్టిఫికేట్ పొందిన సినిమాలు చాలా తక్కువ. అలాంటిది ఛల్ మోహన్ రంగ సినిమాకు క్లీన్-U సర్టిఫికేట్ వచ్చిందంటే ఇదొక డీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతోంది.

ఇక సెన్సార్ టాక్ విషయానికొస్తే.. సినిమా ఫస్టాఫ్ మొత్తం హిలేరియస్ గా ఉందట. త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు, కామెడీ జోకులతో నిండిపోయిందట. ఇక సెకండాఫ్ లో లవ్, ఎమోషన్, కాస్త సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఛల్ మోహన్ రంగ సినిమా.. ఈ సమ్మర్ లో పెర్ ఫెక్ట్ మూవీగా నిలవబోతోంది. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఛల్ మోహన్ రంగ.