'ఛల్ మోహన్ రంగ' నుంచి పక్కా మాస్ సాంగ్

Saturday,March 10,2018 - 11:53 by Z_CLU

నితిన్ సినిమాల్లో మాస్ సాంగ్స్ కొత్త కాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ జానపదాలు అస్సలు కొత్తకాదు. మొన్నటికిమొన్న లై సినిమాలో బొంబాట్ సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిగ్గా  అలాంటి స్టఫ్ తోనే మరో సాంగ్ రెడీ చేశాడు నితిన్.

తెలంగాణలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన “నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ” అనే పాట నుంచి స్పూర్థి పొంది అలాంటిదే మరో సాంగ్ ను ఛల్ మోహన్ రంగ సినిమాలో రీక్రియేట్ చేశారు.

తన 25వ సినిమా ఛల్ మోహన్ రంగలో నితిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. సాహితి ఈ సినిమాకు సాహిత్యం అందిస్తే.. రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడాడు. తమన్ ఈ సాంగ్ ను రీక్రియేట్ చేశాడు.

వరంగల్ లోని వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో ఈ పాటను గ్రాండ్ గా విడుదల చేశారు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5న థియేటర్లలోకి తీసుకురానున్నారు.