మరో సినిమాను స్టార్ట్ చేసిన నాని

Saturday,May 06,2017 - 01:01 by Z_CLU

లేటెస్ట్ గా ‘నేను లోకల్’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం ‘నిన్నుకోరి’ సెట్స్ పై బిజీ గా ఉన్న సంగతి తెల్సిందే. నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే నేచురల్ స్టార్ లేటెస్ట్ గా మరోసినిమాను ను బిగిన్ చేసేశాడు.

దిల్ రాజు నిర్మాణం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘MCA’ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు నాని.. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే ట్యాగ్ లైన్ తో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది…దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి  మొదలైంది .. ఈ షెడ్యూల్ లో  ఈ షెడ్యూల్‌ను నాని, ఆమ‌ని, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రుల‌పై కొన్నికీల‌క‌ స‌న్నివేశాల ను చిత్రీకరించనున్నారు యూనిట్ .