ఈ ఏడాది కూడా రెండు....

Tuesday,March 07,2017 - 03:05 by Z_CLU

గతేడాది ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో సందడి చేసిన చైతు ఈ ఏడాది కూడా ఓ రెండు సినిమాలతో థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు… ఇప్పటికే ‘సోగ్గాడే చిన్ని నాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో నటిస్తున్న సినిమా ను ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చిన చైతూ లేటెస్ట్ గా మరో సినిమాను కూడా సెట్స్ పై పెట్టేశాడు.. ప్రెజెంట్ కళ్యాణ్ కృష్ణ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చిన చైతు కృష్ణ లేటెస్ట్ గా మరిముత్తు అనే అప్ కమింగ్ డైరెక్టర్ తో సినిమాను సెట్స్ పై పెట్టేసి దూసుకెళ్తున్నాడు..

ఇక గతేడాది రెండు డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో ఫాన్స్ ను ఖుషి చేసిన చైతు ఈ ఏడాది కూడా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో ఎంటర్టైన్ చేసి ఈ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు…. మరి లాస్ట్ ఇయర్ ‘ప్రేమమ్’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న చైతు ఈ రెండు సినిమాలతో ఎలాంటి హిట్ సాధిస్తాడా..చూడాలి..