వినాయక్ ప్లానేంటి ?

Tuesday,March 07,2017 - 04:40 by Z_CLU

లేటెస్ట్ గా మెగాస్టార్ రి ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ తో గ్రాండ్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రెజెంట్ ఏ హీరోతో సినిమా చేస్తాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. మొన్నటి వరకూ ‘ఖైదీ నంబర్ 150’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ గడిపిన వినాయక్ ప్రస్తుతం నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టబోతున్నాడట..

మొన్నటి వరకూ ఈ స్టార్ డైరెక్టర్ మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తాడనే వార్త హల్చల్ చేసింది… అయితే ఆ వార్తలో నిజం లేదని లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం తో వినాయక్ నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరా.. అనే టాక్ మొదలైంది.. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం వినాయక్ అల్లు అర్జున్ కోసం రచయితలతో ఓ కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేయిస్తున్నాడని, వక్కంతం,లింగు స్వామి సినిమాల మధ్య లో బన్నీ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…