చెర్రీ కోసం మెగా స్టైలిస్ట్

Tuesday,March 07,2017 - 02:09 by Z_CLU

సుకుమార్ సినిమా అంటేనే హై ఎండ్ స్టైల్. ఈ స్టైలిష్ డైరెక్టర్ సినిమా అనౌన్స్ చేశాడంటే కాన్సంట్రేషన్ మొత్తం హీరో లుక్స్ పైకి మళ్ళుతుంది. తన హీరోల్ని సరికొత్తగా ప్రెజెంట్ చేయడమే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకునే సుకుమార్ టీం లో ఇప్పుడు మెగా స్టైలిస్ట్ సుష్మిత కొణిదెల స్పేస్ ఆక్యుపై చేసుకుంది.

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నం 150 లో చిరుని, యంగ్ లుక్స్ తో ప్రెజెంట్ చేసిన సుష్మిత కొణిదెల ఇప్పడు చెర్రీ కోసం కూడా అదే రేంజ్  స్టైలిష్ లుక్స్ ని డిజైన్ చేయనుంది. 80’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సుష్మిత మంచి ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

 

ఖైదీ నం 150 లో చిరు లుక్స్ విషయంలో 100 కి 100 మార్కులు కొట్టేసిన సుష్మిత, తన కరియర్ లోనే ఫస్ట్ టైం చేర్రీకి స్టైలిష్ గా పని చేయనుంది. సమంతా, రామ్ చరణ్ ఫస్ట్ టైం జోడీ కట్టనున్న ఈ సినిమాలో ఇపుడు సుష్మిత కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.