రేపే బన్నీ కొత్త సినిమా లాంచ్

Tuesday,June 13,2017 - 12:27 by Z_CLU

ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకు సంబంధించి షూట్ ఫినిష్ చేసి త్వరలోనే
డీజే గా థియేటర్స్ లో హంగామా చేయబోతున్నస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇదే స్పీడ్ తో త్వరలోనే నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను నాగబాబు సమర్పిస్తుండగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు ‘నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేసి టైటిల్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. ప్రతీ సినిమాకు ఏదో కొత్త వేరియేషన్ చూపిస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇంకాస్త కొత్త గా కనిపిస్తూ ఓ డిఫరెంట్ హై ఎమోషన్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని సమాచారం.ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ నెలాఖరు నుంచి   ఈ సినిమాను సెట్స్ పై పెట్టి వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడు బన్నీ.