సందీప్ కిషన్ సినిమాకు సూర్య సపోర్ట్

Tuesday,June 13,2017 - 11:11 by Z_CLU

ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్, గతంలో నా పేరు శివ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన సుశీంథరన్ ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమా టైటిల్ డిజైన్, ఫస్ట్ లుక్ ను హీరో సూర్య విడుదల చేశారు. ఈ మూవీకి కేరాఫ్ సూర్య అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

గతంలో నాని సరసన కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాలో నటించిన మెహ్రీన్ ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటిస్తోంది. చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చేనెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.