నెక్స్ట్ సినిమా పై ఫోకస్

Friday,February 17,2017 - 05:59 by Z_CLU

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఇదే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ పుట్టిస్తున్న టాపిక్. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సెట్స్ పై ఉన్న బన్ని ఏప్రిల్ 8 న తన నెక్స్ట్ సినిమాతో సెట్స్ పైకి వచ్చేస్తాడు. అదే రోజు బన్ని బర్త్ డే కూడా కావడం ఆటోమేటిక్ గానే ఈ డేట్ కి వెయిట్ పెరిగిపోతుంది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆల్ రెడీ ప్రీ ప్రొడక్షన్ బిగిన్ అయిపోయింది.

ఈ సినిమా కోసం బాలేవుద్ మ్యూజిక్ కంపోజర్స్ విశాల్ – శేఖర్ లతో పాటు అజయ్ – అతుల్ లను సంప్రదిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా బయటికి వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ గనక అఫీషియల్ గా కన్ఫం అయితే, నెక్స్ట్ సంక్రాంతికి ఈ సినిమాతో థియేటర్స్ లో ఉంటాడు బన్ని.