డీజే అదరగొట్టాడు...'

Saturday,February 18,2017 - 09:28 by Z_CLU

పైకి మాత్రం డీజే. లోపల మాత్రం దువ్వాడ జగన్నాధమ్. పేరు మాత్రమే కాదు.. డీజే అసలు రూపం కూడా రివీల్ అయింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక డీజే మూవీ ఫస్ట్ లుక్ గ్రాండ్ గా రిలీజైైంది. బ్రాహ్మణ కుర్రాడి గెటప్ లో బన్నీ అదరగొట్టాడు. ఛేతక్ బండిపై కూరగాయలు తీసుకొస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. లుక్ ఇలా రిలీజైైందో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది. అన్ని సోషల్ మీడియమ్స్ లో డీజే ఫస్ట్ లుక్ దే హవా.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజుకు ఇది 25వ సినిమా. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్య, పరుగు చిత్రాల తర్వాత దిల్ రాజు – బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.