స్లమ్ గర్ల్ గా తమన్నా

Thursday,February 16,2017 - 08:18 by Z_CLU

తన కరియర్ లోనే ఫస్ట్ టైం విక్రమ్ తో జోడీ కడుతుంది తమన్నా. ‘స్కెచ్’ అని డిఫెరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్ ఫాస్ట్ పేజ్ లో షెడ్యూల్స్ ని డిజైన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా చుట్టూ ఇంకో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ సరికొత్త అవతారంలో కనిపించనుందట. అల్టిమేట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా స్లమ్ గర్ల్ గా కనిపించనుందట. పర్ఫామెన్స్ కి బోలెడంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్న తమన్నాని, హై ఎండ్ ఇమోషనల్ షేడ్స్ లో హార్ట్ టచింగ్ సీక్వెన్సెస్ లో మెస్మరైజ్ చేయనుందట.

విజయ్ చందర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.