మెగా బ్రదర్స్ మధ్యలో బోయపాటి

Friday,September 09,2016 - 06:53 by Z_CLU

 

సరైనోడుతో బన్నీకే కాదు… టోటల్ మెగా కాంపౌండ్ కే కిక్కిచ్చాడు బోయపాటి శ్రీను. మాస్-యాక్షన్ సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న ఈ దర్శకుడికి ఓ అవకాశం ఇవ్వాలని మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ అనుకుంటున్నారు. దీంతో ఈ స్టార్ హీరోలు ఇద్దర్లో ఎవరితో బోయపాటి నెక్ట్స్ సినిమా ఉంటుందనే టాపిక్, ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ హాట్ గా మారింది.

mega-star

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరితో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. బోయపాటికి కూడా అదే కోరిక. తాజా సమాచారం ప్రకారం… చిరంజీవి-బోయపాటి సినిమా కన్ ఫర్మ్ అయింది. చిరు 151వ సినిమా బోయపాటి డైరక్షన్ లోనే ఉంటుందనేది దాదాపు పక్కా అయింది. ఖైదీ నంబర్-150 థియేటర్లలోకి వచ్చిన వెంటనే… చిరు-బోయపాటి కాంబో సెట్స్ పైకి వస్తుంది.

pawan-kalyan-pic

మరోవైపు పవన్-బోయపాటి కాంబినేషన్ ను కూడా తీసిపారేయలేం. కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్న ఈ ప్రాజెక్టు కూడా సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… 2019 ఎన్నికలతో పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి దిగాలనుకుంటున్నాడు పవన్ కల్యాణ్. ఆ టైమ్ కు బోయపాటి దర్శకత్వంలో, పవన్ హీరోగా… తను నిర్మాతగా ఓ సినిమా చేస్తే బాగుంటుందని దాసరి నారాయణరావు భావిస్తున్నారని సమాచారం. ఓ సినిమా చేస్తానని దాసరికి ఇప్పటికే పవన్ మాటివ్వడంతో… ఆ ప్రాజెక్టులోకి బోయపాటిని దర్శకుడిగా తీసుకోవాలని దాసరి ఆలోచిస్తున్నారట.