ఇప్పటికైనా చైతు బయటపడతాడా...?

Saturday,September 10,2016 - 07:00 by Z_CLU

అక్కినేని యంగ్ తరంగ్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించుకుంటున్నారనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది. ఈ విషయంపై నాగచైతన్య ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం ఆ టాపిక్ కూడా ఎక్కడా ఎత్తలేదు. మరోవైపు సమంత మాత్రం ఇండైరెక్ట్ గా తమ లవ్ ఎఫైర్ గురించి బయటపెట్టేసింది. నిజానికి సమంత చెబితేనే మీడియాకు చాలా విషయాలు తెలిసాయి. అయితే ఇప్పుడీ ప్రేమ వ్యవహారంపై నాగార్జున కూడా ఓపెన్ అయిపోయాడు. ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాగ్… చైతూకు ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి చేస్తానని ప్రకటించాడు. సమంత పేరును కూడా బయటపెట్టాడు. మీకు అందరికీ తెలుసు కదా… ఆ అమ్మాయి పేరు సమంత అంటూ మీడియాకు చెప్పేశాడు. స్వయంగా నాగార్జున సమంత పేరును బయటపెట్టడంతో ఇప్పుడంతా నాగచైతన్య వైపు చూస్తున్నారు. కనీసం ఈసారైనా చైతూ బయటపడతాడా అని అందరూ వెయిటింగ్. అవును.. నేనూ సమంత ప్రేమించుకుంటున్నాం అనే మాట నాగచైతన్య నోటి నుంచి వస్తే… వినాలని మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.