సినిమాలుగా CM ల జీవితాలు

Thursday,October 20,2016 - 03:52 by Z_CLU

తెలుగుతెరపై తిరుగులేని బయోపిక్ లు కనువిందు చేయబోతున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికే ఫైనలైజ్ అయింది. ఇంకొకటి చర్చల్లో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుల జీవిత చరిత్రల ఆధారంగా 2 బయోపిక్ లు తెరపైకి రాబోతున్నాయి. వీటితో ముఖ్యమంత్రి కేసీఆర్  బయోపిక్ ఓకే అయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో KCR ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయన రాజకీయ జీవితంపై  చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్న మధుర శ్రీధర్ ఆయన జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు.

91847-telangana-chief-minister-k-chandrasekhar-rao

ఈ సినిమాని 2017 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున షూటింగ్ మొదలుపెట్టి 2018 ఫిబ్రవరి 17 KCR జన్మదినం సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. పెళ్లిచూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవిత చరిత్రపై కూడా సినిమా తీస్తారనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతున్నప్పటికీ… అదింకా గ్రౌండ్ వర్క్ స్టేజ్ లోనే ఉంది. త్వరలోనే ఓ మంచి మూహూర్తం చూసి ఆ ప్రాజెక్ట్ కూడా ఎనౌన్స్ చేస్తారు.

nara-chandrababu-naidu-nagali_1

ఇక మరో క్రేజీ బయోపిక్ అయితే ఇప్పటికే సెట్స్ పైకి కూడా వచ్చేసింది. మాజీ బాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ క్రీడా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించబోతున్నాడు. స్వతహాగా బాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు… పుల్లెల గోపీచంద్ పాత్రను పోషించడం కోసం చాలానే కష్టపడుతున్నాడు.