కల్యాణ్ రామ్ తో జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్...

Thursday,October 20,2016 - 04:54 by Z_CLU

పూరి జగన్నాధ్ తో కలిసి హీరో ‘ఇజం’ చూపించడానికి రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.

* అందుకే సిక్స్ ప్యాక్ చేశా…

ఈ కథ చెప్పగానే  బాగా కనెక్ట్ అయిపోయా. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్ ఇది. అందుకే ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ గా కనిపించాలనుకున్నాం. దాని కోసం బాగా వర్కవుట్స్ చేశా. సన్నబడి సిక్స్ ప్యాక్ సాధించా.

* 8 పేజీల డైలాగ్ చెప్పా …

 జనరల్ గా నేను కాస్త తక్కువ మాట్లాడతా. సినిమాల్లో కూడా అంతే. కానీ పూరి నాలోని ఓ కొత్త కోణాన్ని బయట పెట్టారు. ఈ సినిమాలో కోర్ట్ సీన్ లో 8 పేజీల డైలాగ్స్ నాతో చెప్పించి షాక్ చేశారు. డైలాగ్స్ ఇవ్వగానే ఇన్ని పేజీల డైలాగ్స్ ఆ?  నన్ను అలా యాక్సెప్ట్ చేస్తారా? అని అడిగాను. ఆయన నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆ డైలాగ్స్ చెప్పించారు. ఆ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.

*ఆడియన్స్  కూడా ఫాలో అవుతున్నారు…

లేటెస్ట్ గా ఆడియన్స్ మా హీరో ని ఇలాగే చూడాలని అనుకోవడం లేదు. ప్రతి అభిమాని తమ హీరో ను ఏదో ఓ కొత్త స్టయిల్ లో చూడాలని కోరుకుంటున్నారు. అంతే కాదు వాళ్ళు కూడా ఇంటర్నెట్ ద్వారా అన్ని విషయాలు, ఇతర దేశాల్లో ఉండే మార్పు, స్టయిల్ అన్ని ఫాలో అవుతున్నారు. అందుకే నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ లుక్ బాగా కనెక్ట్ అయ్యింది.

* అవును.. ఆ వార్త నిజమే…

 సాయి ధరమ్ తేజ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నానని వస్తున్న వార్త నిజమే. ప్రస్తుతం ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే మూవీ డీటెయిల్స్ తెలియజేస్తా.

 * ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ తో…

 యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో  తారక్ హీరోగా నేను ప్రొడ్యూస్ చేసే సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అతి త్వరలో ఓ మంచి సందర్భం చూసి నేనే ఎనౌన్స్ చేస్తా .

*రొటీన్, రొట్ట…

ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. మళ్ళీ ఏదైనా డిఫరెంట్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నా. ఏదో ఓ సినిమా చేసేయాలని రొటీన్ కథతో సినిమా చేస్తే రొటీన్, రొట్ట అనే కామెంట్స్ తప్పవు కదా. ఆడియన్స్ నా సినిమా చూసి బోర్ ఫీలవ్వకూడదు. అందుకే కాస్త జాగ్రత్త పడుతున్నా.