నాగ్ చెప్పిన మేటర్ లో తప్పేంటి....?

Monday,September 12,2016 - 11:11 by Z_CLU

డాక్టర్ల కొడుకులు డాక్టర్లే అవుతారు… బిజినెస్ మేన్ బిడ్డలు బిజినెస్ మేన్ లే అవుతారు… ఓ ఇంజినీర్ తన కొడుకును కూడా ఇంజినీర్నే చేయాలనుకుంటాడు.. మరి ఓ నటుడి కొడుకు నటుడిగా ఎందుకు మారకూడదు. లాజిక్ బాగానే ఉంది. ఇలాంటి సూపర్ లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చింది ఎవరో కాదు.. స్వయంగా మన్మధుడు నాగార్జున. ఇప్పటికే తన ఇద్దరు తనయుల్ని హీరోలుగా వెండితెరకు పరిచయం చేసిన కింగ్… హీరో కొడుకు హీరోగా మారితే తప్పేంటని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ ను నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న నాగార్జున… నటవారసులకు తనదైన స్టయిల్ లో మద్దతిచ్చారు. చిన్నప్పట్నుంచి సినీవాతారణంలో పెరిగి, అక్కడి పరిస్థితులకు అలవాటుపడ్డ వారసులు… మరో రంగంలోకి వెళ్లడానికి ఇష్టపడరని… సినీరంగంలోనే కంఫర్టబుల్ గా ఫీలవుతారనేది నాగార్జున ఫీలింగ్. అందుకే ప్రతి సినీకుటుంబం నుంచి నటవారసత్వం కొనసాగుతోందని నాగ్ చెప్పారు. ఇండస్ట్రీలో చాలామంది ఇదే అభిప్రాయంతో ఉండడం వల్లనే నటవారసత్వం కొనసాగుతోంది. నటులుగా వాళ్లను వాళ్లు నిరూపించుకుంటూ, ప్రేక్షకులకు వినోదాన్ని కూడా అందిస్తున్నారు ఎంతోమంది నటవారసులు.