విరామం లేదు.. విశ్రాంతి లేదు...

Tuesday,October 25,2016 - 04:03 by Z_CLU

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో నటిస్తున్న బాలయ్య ఈ సినిమా పూర్తయిన వెంటనే తన తదుపరి సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడట. డిసెంబర్ నాటికి శాతకర్ణి షూటింగ్ పూర్తి చేసి… ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా అదే నెలలో ‘రైతు’ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య.

       ఇప్పటికే ఈ సినిమా కథను లాక్ చేసిన నటసింహం… సినిమా ప్రారంభం కోసం డిసెంబర్ లో ఓ మంచి ముహూర్తం చూసి డేట్ కూడా ఫిక్స్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. రైతుల ఆవేదన ఇతివృత్తంగా చేసుకొని  కథను సిద్ధంచేసిన కృష్ణవంశీ… ఆ కథకు కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించబోతున్నాడట. బాలయ్య రైతు గెటప్ లో కనిపించనున్న ఈ చిత్రం లో బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్… రాష్ట్రపతి పాత్రలో మెరవబోతున్నారని టాక్.