Cinema City - నాగ్-చిరు నయా ప్లాన్స్

Sunday,November 08,2020 - 12:04 by Z_CLU

హైదరాబాద్ లో ఇప్పటికే చాలా స్టుడియోస్ ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన రామోజీ ఫిలింసిటీ ఉంది. అన్నపూర్ణ స్టుడియోస్, రామానాయుడు స్టుడియోస్, సారథి స్టుడియోస్ ఉన్నాయి. వీటికి తోడు బన్నీ కొత్త స్టుడియోకు శంకుస్థాపన చేశాడు. వీటికి తోడు ఇప్పుడు సినిమా సిటీ కూడా రాబోతోంది.

హైదరాబాద్ శివార్లలో దాదాపు 1500-2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫిలింసిటీ రాబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. చిరంజీవి, నాగార్జున ప్రత్యేకంగా కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సినిమా సిటీ నిర్మాణం తెరపైకొచ్చింది.

Telangana CM KCR Announces Cinema City

సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. 1500-2000 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది