భీష్మ క్లోజింగ్ కలెక్షన్స్

Thursday,March 26,2020 - 01:10 by Z_CLU

నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నితిన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకీ కుడుమల దర్శకత్వంలో, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

రెవెన్యూ పరంగా దాదాపు 120శాతం రికవరీతో భీష్మ సినిమా హిట్ గా నిలిచింది. ఏపీ,నైజాంలోకి ప్రతి ఏరియా నుంచి ప్రతి బయ్యర్ ఈ సినిమాతో లాభపడ్డాడు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోయినప్పటికీ.. హిట్ టాక్ తో 3 కోట్ల 50 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది.

భీష్మ క్లోజింగ్ షేర్స్
నైజాం – రూ. 9.15 కోట్లు
సీడెడ్ -రూ. 3.30 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.11 కోట్లు
ఈస్ట్ – రూ. 1.80 కోట్లు
వెస్ట్ – రూ. 1.34 కోట్లు
గుంటూరు – రూ. 1.91 కోట్లు
నెల్లూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 1.62 కోట్లు