'భీష్మ' టీంకి అభినందనలు -త్రివిక్రమ్

Tuesday,February 18,2020 - 11:20 by Z_CLU

సాదారణంగా ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  గెస్ట్ గా వెళ్ళిన ఎవరైనా సినిమా గురించి తను అనుకుంటున్న నాలుగు మాటలు చెప్పి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పడం కామనే. కానీ నిన్న జరిగిన ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ఆల్ ది బెస్ట్ కు బదులు టీంకు అభినందనలు తెలిపాడు. రిలీజ్ రోజు నైట్ పెద్ద పార్టీ చేసుకోవడానికి  రెడీ గా ఉండండి. ఆ పార్టీకి నన్ను పిలవడం మర్చిపోవద్దని టీంకి చెప్పాడు. దీంతో ‘భీష్మ’ పై త్రివిక్రమ్ కాన్ఫిడెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

నిజానికి త్రివిక్రమ్ ‘భీష్మ’ సక్సెస్ గురించి అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఈవెంట్ కి ఎటెండ్ అయ్యే ముందే త్రివిక్రమ్ కు సినిమా చూపించారు టీం. సినిమాలో ఉన్న కంటెంట్ చూసి తన జడ్జిమెంట్ అలా వేదికపై చెప్పేసాడు త్రివిక్రమ్. మరి ఈ నెల 21 న థియేటర్స్ లోకి వస్తున్న నితిన్ ‘భీష్మ’ త్రివిక్రమ్ మాటను నిజం చేస్తుందా చూడాలి.