విరాళాలు ప్రకటించిన పవన్, త్రివిక్రమ్

Thursday,March 26,2020 - 11:56 by Z_CLU

కరోనాపై పోరాటానికి టాలీవుడ్ ముందుకు కదిలింది. తెలుగు రాష్ట్రాలకు తమవంతుగా విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఇందులో భాగంగా టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కరోనా కట్టడి కోసం విరాళాలు ప్రకటించారు.

కరోనా సహాయక చర్యల కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరో యాభై లక్షల చొప్పున సాయం అందించబోతున్నట్టు ప్రకటించారు.

అటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 10 లక్షల రూపాయల వంతున ప్రకటించారు. ఇప్పటికే హీరో నితిన్ తెలుగు రాష్ట్రాలకు విరాళం అందించాడు. వీళ్ల బాటలో రాబోయే రోజుల్లో మరింతమంది ప్రముఖులు విరాళాలు ప్రకటించడానికి ముందుకొస్తున్నారు.