నితిన్, వెంకీ కుడుముల 'భీష్మ' ప్రారంభం

Wednesday,June 12,2019 - 12:18 by Z_CLU

నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘భీష్మ’ ప్రారంభమైంది. ‘ఛలో’ తర్వాత దాదాపు ఏడాది పాటు ఈ సినిమా స్క్రిప్ట్ కోసం వర్క్ చేసిన దర్శకుడు వెంకీ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసాడు. ఈ నెల 20 నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ ప్లే బాయ్ గా కనిపించనున్నాడు. నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు.