హాట్ టాపిక్: మలయాళ రీమేక్ లో బాలయ్య

Thursday,March 26,2020 - 03:12 by Z_CLU

సౌత్ లో చూసుకుంటే మంచి కథలు ఎక్కువగా మలయాళం నుంచే వస్తున్నాయి. అందుకే ఆ సినిమాలే ఎక్కువగా ఇతర భాషల్లో రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలో మరో మలయాళ సినిమా టాలీవుడ్ ను ఆకర్షిస్తోంది. అదే అయ్యప్పనుమ్ కోశియుమ్.

ఫృధ్వీరాజ్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో రీసెంట్ గా సూపర్ హిట్టయింది. ఇప్పుడీ సినిమా రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడీ రీమేక్ లో నటసింహం బాలయ్య నటించబోతున్నాడనే డిస్కషన్ హాట్ హాట్ గా జరుగుతోంది. అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ పాత్రను బాలయ్య చేస్తేనే బాగుంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో అతడు నటిస్తాడా లేదా.. నటిస్తే డైరక్టర్ ఎవరనేది తేలాల్సి ఉంది. ఒకవేళ బాలయ్య ఒప్పుకుంటే సితార బ్యానర్ పై అతడు నటించే మొట్టమొదటి ప్రాజెక్టు ఇదే అవుతుంది.