ఈ రోజే బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్ లుక్ రిలీజ్

Wednesday,November 01,2017 - 10:51 by Z_CLU

బాలకృష్ణ 102వ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ కానుంది. సినిమాకు ఇప్పటికే జై సింహా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ లోగో డిజైన్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. సాయంత్రం సరిగ్గా 4 గంటల 44 నిమిషాలకు ఈ ఫస్ట్ లుక్ ప్రత్యక్షంకానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. బాలయ్య సరసన నయనతారతో పాటు హరిప్రియ, నటాషా జోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. K.S. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీత దర్శకుడు. C.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై C. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.