నెక్ట్స్ నువ్వే: మెయిన్ ఎట్రాక్షన్స్ ఇవే

Wednesday,November 01,2017 - 12:38 by Z_CLU

ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నెక్ట్స్ నువ్వే. కామెడీ-హారర్ జానర్ లో సరికొత్తగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 2 రోజుల్లో నెక్ట్స్ నువ్వే సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి

  1. రీమేక్

తమిళ్ లో హిట్ అయిన ‘యామిరుక్కు భయమే’ అనే  సినిమాకు రీమేక్ గా వస్తోంది నెక్ట్స్ నువ్వే. రీమేక్ అంటేనే సగం హిట్ అయినట్టు లెక్క. అలా నెక్ట్స్ నువ్వేపై అంచనాలు పెరిగాయి. శాండిల్ వుడ్ లో లో-బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులోకి వచ్చేసరికి మాత్రం గ్రాండియర్ గా ముస్తాబైంది.

  1. దర్శకుడు

నెక్ట్స్ నువ్వే సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ దర్శకుడు. పలు సూపర్ హిట్ సీరియళ్లు, సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన ప్రభాకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇన్నాళ్లూ నటుడిగానే ఆకట్టుకున్న ప్రభాకర్, నెక్ట్స్ నువ్వేతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నాడు.

  1. నిర్మాతలు

నెక్ట్స్ నువ్వే సినిమాతో టాలీవుడ్ కు ఓ సరికొత్త బ్యానర్ పరిచయమౌతోంది. అది కూడా అలాంటిలాంటి బ్యానర్ కాదు. అల్లు అరవింద్, జ్ఞానవేల్ రాజా లాంటి హేమాహేమీలు కలిసిపెట్టిన ప్రొడక్షన్ హౌజ్ ఇది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ, అల్లు అరవింద్, జ్ఞానవేల్ రాజా కలిసి వి-4 మూవీస్ అనే బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్ పై వస్తున్న ఫస్ట్ మూవీగా నెక్ట్స్ నువ్వే చరిత్రలో నిలిచిపోనుంది.

  1. హీరోహీరోయిన్స్

ఈ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ హీరోహీరోయిన్లు. డెడికేషన్ కు కేరాఫ్ గా చెప్పుకునే ఆది ఇందులో హీరోగా నటించాడు. తన సెటిల్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో మూవీకి ఓ లుక్ తీసుకొచ్చాడు. ఇక హీరోయిన్లు వైభవి, రేష్మి ఈ సినిమాకు ఓ కిక్ తీసుకొచ్చారు.

  1. కామెడీ

హీరోహీరోయిన్ల తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ బ్రహ్మాజీ గురించి. కెరీర్ లో లెక్కలేనన్ని పాత్రలు పోషించిన బ్రహ్మాజీ, నెక్ట్స్ నువ్వేలో వెరీ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ట్రయిలర్ చూస్తే బ్రహ్మాజీ పాత్ర ఎంత కీలకమైందో, ఎంత కామెడీగా ఉంటుందో అందరికీ అర్థమౌతుంది.

  1. స్క్రీన్ ప్లే

నెక్ట్స్ నువ్వే సినిమాలో మరో మెయిన్ ఎట్రాక్షన్ స్క్రీన్ ప్లే. కన్నడ వెర్షన్ లో ఈ స్క్రీన్ ప్లే మేజిక్ చేసింది. ఇప్పుడు అదే మేజిక్ ను యాజ్ ఇటీజ్ గా తెలుగులో కూడా రిపీట్ చేయబోతున్నారు. మూవీలో కొన్ని మార్పులు చేసినప్పటికీ స్క్రీన్ ప్లే లో ఫ్లో మాత్రం తగ్గదు.

  1. క్లయిమాక్స్

నెక్ట్స్ నువ్వే సినిమాకు మరో ఎట్రాక్షన్ క్లయిమాక్స్. తమిళ్ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో క్లయిమాక్స్ మొత్తం మార్చేశామని చెబుతున్నారు మేకర్స్. నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులతో పాటు సరికొత్త క్లయిమాక్స్ అందరికీ నచ్చుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

  1. మ్యూజిక్

ఈ ఎట్రాక్షన్స్ తో పాటు సాయికార్తీక్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఇప్పటికే పాటలు హిట్ అవ్వగా, సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరికీ కచ్చితంగా నచ్చుతుందంటున్నాడు దర్శకుడు ప్రభాకర్.

ఇలా ఎన్నో ఎట్రాక్షన్స్ తో ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న నెక్ట్స్ నువ్వే సినిమా ఆడియన్స్ ను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లయిమాక్స్ వరకు ఫుల్ లెంగ్త్ లో ఎంటర్ టైన్ చేయబోతోంది.