బాహుబలి సంచలనాలు

Tuesday,October 18,2016 - 11:27 by Z_CLU

సినిమా షూటింగ్ కి ఇంకా శుభం కార్డు కూడా పడలేదు. అప్పుడే బాహుబలి హక్కుల కోసం యుద్ధం మొదలైంది. ఎంత భారీ పోటీ లేకపోతే కోట్లకు కోటు వెచ్చించి మరీ హక్కులు దక్కించుకుంటారు. మొన్నటికి మొన్న గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ 45 కోట్లు వెచ్చించి నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకుంటే, ఫ్యాన్సీ రేటు  చెల్లించి మరీ నారంగ్స్ ఏషియన్ మూవీస్ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకుంది.

            హక్కుల యుద్ధం డిస్ట్రిబ్యూషన్ వరకు ఆగిందా..? శాటిలైట్ రైట్స్ కూ పాకింది. మొన్నటికి మొన్న తెలుగు హక్కులు మాటీవీ దక్కించుకుంటే ఇప్పుడు Sony T.V. ఏకంగా 51 కోట్లు చెల్లించి మరీ హిందీ శాటిలైట్  హక్కులు దక్కించుకుంది.  ఓ తెలుగు సినిమా హిందీ వెర్షన్ కు ఇంత రేటు రావడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం.