పవన్ న్యూలుక్...

Monday,October 17,2016 - 04:32 by Z_CLU

 కాటమరాయుడు అనౌన్స్ అయింది మొదలు ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం సినిమాపైనే ఉంది. లవర్ బాయ్ గా స్టార్ట్ అయిన పవర్ స్టార్ కరియర్లో ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించినా, అన్నగా కనిపించే సినిమా కాటమరాయుడు. నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ నటిస్తుండడంతో అందరి దృష్టి పవన్ పై పడింది. మరీ ముఖ్యంగా నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా కనిపించేందుకు పవన్ ఎలాంటి మేకోవర్ చూపించబోతున్నాడనే ఆసక్తి క్రియేట్ అయింది. తాజాగా పవన్ పెట్టిన ఓ ప్రెస్ మీట్ తో ఆ సందేహాలకు సమాధానం దొరికింది. గెటప్ లో పెద్దగా వేరియేషన్ చూపించని పవన్… మేనరిజమ్స్ లో మాత్రం మార్పు తీసుకొస్తున్నాడట.

pawan-katamarayudu

         పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో ఎంత సీరియస్ క్యారెక్టర్ చేసినా ఎంతో కొంత అల్లరి కనిపించేది. కానీ కాటమరాయుడులో కంప్లీట్ సీరియస్ పాత్ర పోషిస్తున్నాడట. ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న కాటమరాయుడు కి అన్ని ఫిక్స్ అయిపోయాయి. నలుగురు తమ్ముళ్ళ క్యారెక్టర్స్ తో పాటు హీరోయిన్ గా శృతి హాసన్ కూడా సెట్స్ పైకి వచ్చేసింది.