బాహుబలి-2 : 14 రోజుల్లో 160 కోట్లు

Friday,May 12,2017 - 07:30 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ హిట్ సాధించిన బాహుబలి – ది కంక్లూజన్ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారం లోకి ఎంటరైంది. ఈ 2 వారాల్లో ఈ సినిమా దాదాపు సునామీ సృష్టించిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిన బాహుబలి-2 సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. 2 వారాల్లో ఈ సినిమాకు ఏకంగా 160.26 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా వసూళ్లు (షేర్)

నైజాం – 53.60 కోట్లు

సీడెడ్ – 27.90 కోట్లు

నెల్లూరు – 6.20 కోట్లు

గుంటూరు – 14.82 కోట్లు

కృష్ణా – 11.29 కోట్లు

వెస్ట్ – 10.66 కోట్లు

ఈస్ట్ – 14.60 కోట్లు

ఉత్తరాంధ్ర – 21.19 కోట్లు

రెండు వారాల మొత్తం షేర్ – రూ. 160.26 కోట్లు