స్పైడర్ ఫస్ట్ వీక్ వసూళ్లు

Thursday,October 05,2017 - 04:10 by Z_CLU

మహేష్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమా మొదటివారం భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన అన్ని కేంద్రాల నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ తొలి వారంలో ఏకంగా 32 కోట్ల రూపాయల షేర్ సాధించడం విశేషం. అది కూడా ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే. ఇక వరల్డ్ వైడ్ 110 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా దసరా సీజన్ ముగిసినప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ, థియేటర్లలో స్టడీగా కొనసాగుతోంది.

ఏపీ, నైజాంలో స్పైడర్ ఫస్ట్ వీక్ వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 9.57 కోట్లు
సీడెడ్ – రూ. 4.68 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.86 కోట్లు
ఈస్ట్ – రూ. 3.79 కోట్లు
వెస్ట్ – రూ. 2.92 కోట్లు
గుంటూరు – రూ. 3.60 కోట్లు
కృష్ణా – రూ. 2.33 కోట్లు
నెల్లూరు – రూ. 1.78 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ – రూ. 32.53 కోట్లు