చిరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అప్ డేట్స్

Friday,May 12,2017 - 06:56 by Z_CLU

ఏ మాత్రం బ్రేక్ కూడా తీసుకోకుండా బిజీ బిజీగా ఉంది ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి టీమ్. మెగాస్టార్ ఒక్కసారి సెట్స్ పైకి వచ్చాడంటే సినిమాకి ప్యాకప్ చెప్పనిదే అంత ఈజీగా ప్యాకప్ చెప్పడు. అందుకే 100 కోట్ల బడ్జెట్  తో  తెరకెక్కనున్న ఈ సినిమా, సెట్స్ పైకి రాకముందే  సినిమాకి కావాల్సిన సరంజామా అంతా సర్ది పెట్టుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బుర్రా సాయి మాధవ్ కూడా రీసెంట్ గా యూనిట్ తో జత కట్టేశాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా యూనిట్, ఆల్ రెడీ దీనికి సంబంధించిన రీసర్చ్ కి ప్యాకప్ చెప్పేసింది. ఇప్పుడా ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా ఇంటరెస్టింగ్ గా ఎలా ప్రెజెంట్ చేయాలో డిజైన్ చేసుకునే పనిలో ఉంది ఉయ్యాల వాడ టీమ్.

ఆగష్టు 22 న ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయనున్న సినిమా యూనిట్, సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. పనిలో పనిగా మరోవైపు ఈ సినిమా తక్కిన కాస్టింగ్ విషయంలోను డిస్కషన్ జరుపుతుంది సినిమా యూనిట్.