అరవింద సమేత ఫస్ట్ వీక్ కలెక్షన్

Thursday,October 18,2018 - 03:30 by Z_CLU

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ అరవింద సమేత సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. విడుదలైన ఈ వారం రోజుల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు యంగ్ టైగర్. మరీ ముఖ్యంగా వారం కూడా తిరక్కముందే వంద కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లోకి చేరాడు.

ఇక ఫస్ట్ వీక్ వసూళ్లు చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత చిత్రానికి ఏకంగా 58 కోట్ల 48 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ షేర్ నిన్నటితో 82 కోట్ల 13 లక్షల రూపాయలకు చేరింది. సినిమా హిట్ అవ్వడంతో పాటు, దసరా సీజన్ కూడా కావడంతో అరవింద సమేత సినిమా హౌజ్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతోంది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ (7 రోజుల) షేర్
నైజాం – రూ. 16.63 కోట్లు
సీడెడ్ – రూ. 13.49 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.57 కోట్లు
ఈస్ట్ – రూ. 4.68 కోట్లు
వెస్ట్ – రూ. 3.92 కోట్లు
గుంటూరు – రూ. 6.84 కోట్లు
కృష్ణా – రూ. 4.16 కోట్లు
నెల్లూరు – రూ. 2.16 కోట్లు