NTR బయోపిక్ – హరికృష్ణ లా కళ్యాణ్ రామ్

Thursday,October 18,2018 - 05:58 by Z_CLU

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది NTR బయోపిక్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హరికృష్ణ లా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో జస్ట్ వెనక నుండి ఉన్న స్టిల్ ని రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్, దసరా సందర్భంగా ఈ రోజు మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. NTR లా బాలయ్య ఎంత ఆప్ట్ అనిపించుకున్నాడో, కళ్యాణ్ రామ్ కూడా హరికృష్ణ లా అంతే పర్ఫెక్ట్ అనిపించుకుంటున్నాడు.

NTR బయోపిక్ 2 భాగాలుగా రిలీజవుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ‘కథా నాయకుడు’ లో NTR లైఫ్ లోని నట జీవితం హైలెట్ అయితే, ‘మహా నాయకుడు’ ని ఆయన రాజకీయ జీవితంలోని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే 2 భాగంలో NTR ‘చైతన్య రథ సారథి’ హరికృష్ణ లా కీలకమైన రోల్ లో కనిపించనున్నాడు కళ్యాణ్ రామ్.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.